![]() |
![]() |

పఠాన్ సినిమా సక్సెస్ అయినందుకు షారుఖ్ ఆనందోత్సాహంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఆత్మీయంగా సందేశాన్నిచ్చారు. అందులో సందేశం కన్నా ప్రేమ, కృతజ్ఞతా భావాలు ఎక్కువగా కనిపించాయి. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన సినిమా పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. జాన్ అబ్రహాం కీ రోల్ చేశారు. దీపిక పదుకోన్ హీరోయిన్‌గా నటించారు. జనవరి 25న విడుదలైన ఈ సినిమా హిందీలో బాహుబలి2ని క్రాస్ చేసింది. రికార్డులు ఉన్నవే బ్రేక్ చేయడానికి పఠాన్‌తో షారుఖ్ మా బాహుబలిని క్రాస్ చేసినందుకు ఆనందంగా ఉంది అంటూ స్పోర్టివ్‌గా కంగ్రాజులేషన్స్ చెప్పారు ప్రముఖ నిర్మాత శోభు. అటు పఠాన్ డైరక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా అమితమైన ఆనందాన్ని పంచుకున్నారు. అసలు నేను ఊహించలేదు. కానీ మంచి సక్సెస్ కావాలని కోరుకున్నాను. బాలీవుడ్ జనాలు నా మీద ఎన్నో ఏళ్లుగా ప్రేమ చూపిస్తున్నారు. బాలీవుడ్‌లోనే నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడి రుణాన్ని వెయ్యి కోట్ల ప్రాజెక్టుతో తీర్చుకున్నానని భావిస్తున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా తన ఫ్యాన్స్ తో అలాంటి పోస్టునే షేర్ చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఒక్క హిట్ కూడా ఆడలేదు షారుఖ్‌కి. అందుకే పఠాన్ సక్సెస్‌ని ఆయన మనసుకు తీసుకున్నారు. ``ఇది బిజినెస్ కాదు, పూర్తిగా పర్సనల్`` అంటూ ట్వీట్ చేశారు. ``ప్రజలను నవ్వించడం వాళ్లకు వినోదాన్ని పంచడం మా బిజినెస్. అయితే దాన్ని మేం పర్సనల్ గా తీసుకోకపోతే అద్భుతాలు జరగవు. అద్భుతం జరిగిందంటేనే అది మా పర్సనల్ విషయం అనే అర్థం. పఠాన్ కి ప్రేమ పంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పఠాన్‌కి పనిచేసిన వారికి ధన్యవాదాలు. జీవితంలో ఇంత గొప్ప భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్`` అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నారు. పోస్ట్ సమ్మర్ విడుదల కానుంది జవాన్. నయనతార నాయిక. విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పెళ్లయ్యాక నయన్ నటిస్తున్న పూర్తి స్థాయి సినిమా ఇదే. ఆమెకు తొలి నార్త్ మూవీ కూడా ఇదే.
![]() |
![]() |